16 April, 2026 | 1:54 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

16-04-2026 12:00 AM

వెల్దుర్తి, ఏప్రిల్ 15: వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తి, ఆరెగూడెం గ్రామాల్లో పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు అనంతరం వెల్దుర్తి, ఆరెగూడెం గ్రామ సర్పంచ్ లు మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో పోసి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

రైతులు ధాన్యం విక్రయాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఆరెగూడెం గ్రామ సర్పంచ్ చైతన్య హనుమంత్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్ పాల్వంచ శేఖర్, రమేష్ చందర్, జగ్గ అశోక్ గౌడ్, పిఎసిఎస్ సీఈవో అశోక్, రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.