15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అభివృద్ధి ప్రధాత ‘వేం’కు అభినందనలు వెల్లువ

20-04-2025 11:50 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి తదితరులు అభినందనలతో ముంచెత్తారు.

కేసముద్రం పట్టణంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1.50 కోట్లు, ముస్లిం షాది ఖానా నిర్మాణానికి 80 లక్షలు, స్మశాన వాటిక కోసం 90 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఆదివారం ఎమ్మెల్యే మురళి నాయక్ చేతుల మీదుగా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అందజేశారు. అనతి కాలంలోనే కేసముద్రం మండలాన్ని ఊహించని విధంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ సొంత మండలంపై మమకారాన్ని చాటుకుంటున్న వేం నరేందర్ రెడ్డి కి మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు గుగులోతు దస్రు నాయక్, డివైసిసి అధ్యక్షుడు సురేష్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ కమిటీ డిస్టిక్ అథారిటీ మెంబర్ రావుల మురళి, నాయకులు బండారు దయాకర్ తదితరులున్నారు.