30 March, 2026 | 9:42 PM

నిర్మల్ జిల్లా వైద్యాధికారికి అభినందన

30-03-2026 08:18 PM

కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అమ్మ రక్షిత పథకంతో జాతీయస్థాయిలో స్కోప్ అవార్డు పొందిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ ను ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక కృషితో అమ్మ రక్షిత పథకాన్ని నిర్మల్ జిల్లాలో అమలు చేయడం వల్ల ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడిమ బోజు పటేల్ తదితరులు  ఉన్నారు.