12 April, 2026 | 1:42 PM

విద్యార్థులకు అభినందన

31-12-2025 08:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఇటీవల నిర్వహించిన కూచిపూడి నృత్యంతో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న నిర్మల్ పట్టణంలోని విజయ హై స్కూల్ విద్యార్థులను బుధవారం పాఠశాలలో అభినందించారు. భారత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ నృత్య ప్రదర్శన నిర్వహించగా పాఠశాలకు చెందిన శ్రీ ఈత అద్విత ఆద్య అనిత దేవి శ్రీ అనుజ అనే విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి కరస్పాండెంట్ మంచిర్యాల్ నాగభూషణం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.