దుదిళ్ల కుటుంబ జోలికి వస్తే నీ పుట్ట పగులుద్ది పుట్ట
మంథని,(విజయక్రాంతి): దుదిళ్ల కుటుంబం జోలికి వస్తే నీ పుట్ట పగులుద్ది పుట్ట మధు అని మంథని మంథనిలో విలేకరుల సమావేశంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. బుధవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఒరేయ్ అనే పదం వాడిండ తెలుసుకో అన్నారు.
రాజ్యాంగం చదవని నువ్వు అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకుని ఏక వచనంతో మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న మీకు పిచ్చి లేసి, మతి భ్రమించి మాట్లాడుతున్నావని మంథని ప్రజలకు అర్థమైందన్నారు. నిన్ను ఒరేయ్ వెధవ అని కూడా మాకు తిట్టవచ్చని కానీ మా సారు మా తల్లిదండ్రులు అలాంటి పదజాలాలు మాకు నేర్పలేదని అన్నారు. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకుని మంచిగా వ్యవహరిస్తే మేము కూడా మంచిగా ఉంటామని, లేకుంటే నీ భర్తం పట్టుడు ఖాయమని, నీ పుట్ట పగలడం తప్పదని హెచ్చరించారు. ఈరోజే మహిళలు అందరూ మీ ఇంటికి వచ్చి మీ భర్త పడతామంటే మా సార్ వద్దని చెప్పడంతోనే ఊకున్నామని ఇకమీదట మాత్రం ఊకుండే ప్రసక్తే లేదన్నారు.




