25 February, 2026 | 3:25 AM

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పాలన

25-02-2026 12:08 AM
  1. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు!
  2. ద్విముఖి హనుమాన్ విగ్రహాన్ని ధ్వసం చేయడం దారుణం
  3. ఇది సనాతన ధర్మంపై కుట్ర
  4. మహిళా న్యాయవాదిపై దాడి ఆందోళనకరం
  5. తెలంగాణలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ 
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక పాలన సాగిస్తోందని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. రాష్ర్టంలో హిందూ దేవాలయాలు, దేవీదేవతల విగ్రహాలపై వరుస దాడులు యాదృచ్ఛికం కావని, ఇవన్నీ సనాతన ధర్మంపై ప్రణాళికాబద్ధ కుట్రలో భాగ మేనని ఆరోపించారు. ఒకటి కాదు.. రెండు కాదు..

రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటం హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు పరోక్ష మద్దతు ఇచ్చినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలోని ద్విముఖి హనుమాన్ ఆలయంపై జరిగిన దాడి తెలంగాణలో కొనసాగుతున్న హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు.

గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ప్రతీ ఘటనలోనూ దోషులను కఠి నంగా శిక్షించాల్సిన చోట, “పిచ్చివాడు”, “తప్పుదారి పట్టాడు” అంటూ సర్టిఫికెట్లు ఇవ్వ డం ద్వారా హిందూ వ్యతిరేక శక్తులను కాం గ్రెస్ ప్రభుత్వం రెచ్చగొడుతోందని విమర్శించారు. హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా వరుస దాడులపై స్పందన లేకపోవడం కాం గ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు.

అయినా రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రా ధాన్యత ఇస్తూ, అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. చాంద్రాయణగుట్ట హ నుమాన్ ఆలయంపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించా లన్నారు. అలాగే రాష్ర్టంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

లేకపోతే హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు బీ జేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని రాం చందర్ రావు హెచ్చరించారు. అలాగే రు ద్రూర్‌లో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, రా ష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. మహిళా న్యాయవాదిపై దాడి జరగడం ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించాల్సిన తీవ్రమైన ఘటన అని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఓ బాలుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకుని ప్రశ్నించినందుకే మహిళా న్యాయవాది కళ్యాణిని ఎంఐఎం వర్గానికి చెందిన ముష్కరులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, దాడికి పాల్పడటం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. ఈ ఘటనను పోలీసులు అత్యంత సీరియస్‌గా విచారించి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ, రుద్రూర్‌లో జరిగిన ఘటనలు కేవలం యాదచ్ఛికం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని ఆరోపించారు.