మహాదేవపూర్‌లో ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు
కట్కం అశోక్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
మహాదేవపూర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కం అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జన్మదినాన్ని సేవా దినోత్సవంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిం ది. శ్రీపాద చౌరస్తా వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటారు.
తదుపరి శ్రీపాద చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భోజనం చేశారు. అలాగే పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహంగా ప్యాడ్లు మరియు పెన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దుద్దిళ్ల శ్రీను బాబు ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ప్రజానాయకుడిగా గుర్తింపు పొం దారని కొనియాడారు. సమాజానికి సేవ చేయడమే ఆయనకు నిజమైన జన్మదిన వేడుక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సర్పంచ్ హషీనా భాను, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ జడ్పీటీసీ చల్ల తిరుపతి రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విలాస్ రావు, సర్పంచ్లు చల్ల సమ్మిరెడ్డి, పల్లె రాజయ్య, ఆకుల రాజయ్య, మోతే నీలరాణి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వామన్ రావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాపు, కోట సమ్మ య్య, బుర్రి శివరాజ్, ఓబీసీ మండల అధ్యక్షులు పొలు మొండయ్య, మాజీ ఎంపీటీసీ సుధాకర్, గుడాల శ్రీనివాస్, చేకూర్తి శెంకర్, మోతే సమ్మయ్య, వార్డు సభ్యులు ఆశ్రర్ ఖురేషి, మహ్మద్, నాయుమోదిన్, రాజమౌలి, స్వామి, పుసలా హరీష్, పొటు వంశీ, ఉపసర్పంచ్లు సదానంద చారి, తుంగల శ్రీజ సరేష్, పలిమెల కాంగ్రెస్ నాయకులు జవ్వాజి తిరుపతి, మహిళా నాయకురాలు పద్మ రెడ్డి, తడకల జగదీశ్, చెక్రి, రాఘవేంద్ర, సంతోష్, అయిత తిరుపతి రెడ్డి, ఎన్‌ఎస్యూఐ రంజిత్ రెడ్డి, పోత రామకృష్ణ, ఈర్షద్, దోమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




