12 July, 2026 | 5:40 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

పేదల సొంతింటి కలకు కాంగ్రెస్ భరోసా

13-02-2026 12:00 AM

ఇస్సన్నపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

భిక్కనూర్, ఫిబ్రవరి12,(విజయక్రాంతి): బిక్కనూరు మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల రాములు, ఉప సర్పంచ్ రాజమణి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగౌడ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద బాబు, గుడిసె నారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.