13-02-2026 12:00:00 AM
భిక్కనూర్, ఫిబ్రవరి12(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా గురువారం కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు చూపు లోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) గుర్తించి, అవసరమైన వారికి కళ్లద్దాలు సూచించారు. ఆర్బీఎస్కే వైద్యాధికారి డా. సాధన, సిబ్బంది పాల్గొనగా, దోమకొండ డిప్యూటీ డీఎం&హెచ్‌ఓ కార్యాలయానికి చెందిన కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ పరీక్షలు నిర్వహించారు. చిన్న వయసులోనే చూపు సమస్యలను గుర్తించడం ద్వారా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు.