calender_icon.png 26 December, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్

04-05-2024 01:58:29 AM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 3(విజయక్రాంతి): అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. ఆసిఫాబాద్‌లోని తన స్వగృహంలో శుక్ర వారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను కుదించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. అదే జరిగితే కుమ్రం భీం స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఏర్పాటైన తర్వా త గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. తిరిగి జిల్లాను  తొలగిస్తే అభి వృద్ధి కుంటుపడి, ఆదివాసీలు అన్యాయానికి గురవుతారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక తర్జన భర్జన పడుతున్నదన్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిపై ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు. సమావేశంలో సింగి ల్ విండో చైర్మన్ అలీబిన్ హైమ ద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంక న్న, నాయకులు రవీందర్, హైమద్, కార్తీక్, నిసార్, వెంకన్న, ఆశోక్, చిలుకూరి రవి, ఉమ, సుప్రియ పాల్గొన్నారు.