13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి – కనగర్తి గ్రామంలో విషాదం

26-03-2026 04:51 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి రవి (38) గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేస్తున్న సమయంలో తీవ్ర వడదెబ్బకు గురయ్యాడు.సహచర కార్మికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు. మృతుడు రవికి భార్య నిర్మల, ఒక చిన్న పాప ఉన్నారు. కాగా, ఆరు నెలల క్రితం వారి కూతురు మృతి చెందడంతో కుటుంబం ఇప్పటికే విషాదంలో ఉండగా, ఇప్పుడు రవి మరణంతో ఆ కుటుంబం మరింత దుఃఖంలో మునిగిపోయింది.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు ప్రభుత్వాన్ని బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.