13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అధికారుల పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్

26-03-2026 04:50 PM

రైతుల భయభ్రాంతులకు గురి చేస్తున్న రైల్వే కాంట్రాక్టులు

మఠంపల్లి మార్చి 26(విజయ క్రాంతి):మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా, లాలి తండా సమీపంలో రైల్వే కాంట్రాక్టులు(Railway Contracts) రైల్వే లైన్ వెడల్పు భాగంగా నియమ నిబంధనలు పాటించకుండా అధికారుల పర్మిషన్ లేకుండా ఓపెన్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రైతులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఈ బ్లాస్టింగ్ వల్ల పొలాల్లో ఉన్న బోరు మోటర్లు కుంగిపోవడం,కోతకు వచ్చిన వరి పొలాల్లో రాళ్లు పడటం,పశువుల కాపరులు భయానికి లోనవుతారు.

ఇలాంటి జరగకుండా చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ లైసెన్స్ తో చేయాలంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం బ్లాస్టింగ్ దగ్గర సేఫ్టీ సెంట్రి రూము ఏర్పాటు, బ్లాస్టింగ్ చేసే ప్రతిరోజు దానికి సంబంధించిన సామాగ్రి,రోజువారి బ్లాస్టింగ్ లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాలి.కాని ఇవి లేకుండా ఇష్టం వచ్చినట్లు బ్లాస్టింగ్ నిర్వహిస్తూన్నారని రైతులు తెలిపారు.దాదాపుగా 33 కిలోమీటర్ మేర రైల్వే లైన్ వెడల్పు జరుగుతుంది.