06-12-2025 09:43:29 PM
నకిరేకల్,(విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దిగోజు లత వెంకటాచారి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నాయకత్వంలో గ్రామాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలందరూ ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎంపీపీ బచ్చుపళ్లి శ్రీదేవి గంగాధర్,తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులులింగాల వెంకన్న, చందుపట్ల మాజీ ఎంపీటీసీ పుట్ట సరిత సత్యనారాయణ, చందుపట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.