12 March, 2026 | 2:44 AM

మహిళలను గౌరవించడం అందరి బాధ్యత

12-03-2026 01:02 AM

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ మార్చి 11 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్బీ కాలనీ ఫేజ్2 కమ్యూనిటీ హాల్లో డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకులను శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళలు లేనిదే సృష్టి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే, స్థానిక నాయకులు మల్లేష్ గౌడ్, దేవేందర్ కుమార్, చారి, బాల య్య గౌడ్, నవీన్ గౌడ్, కుమార్, రామకృష్ణ, కిరణ్, జయపాల్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకులు భాగ్యమ్మ, పర్వీన్, జ్యోతి, రత్నమాల, లక్ష్మీ, డప్పు లక్ష్మీ, భారతి, అలివేలు, శారద, సృజ న, కొమురమ్మ, స్వరూప, శోభా, సంతోష, లావణ్య, భవాని తదితరులు హాజరయ్యారు.