calender_icon.png 6 December, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి - న్యాయవాదుల నివాళులు

06-12-2025 09:46:12 PM

వేములవాడ,(విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సమానత్వం, న్యాయం,స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెడుతూ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తుచేశారు. ఆయన చూపిన మార్గం న్యాయవ్యవస్థకు స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టల మనోహర్, కటకం జనార్ధన్, గుజ్జే మనోహర్, నాగుల సంపత్ కుమార్, బొజ్జ మహేందర్, బీమా మహేష్ బాబు, ఒద్యారం వేణు, పొత్తూరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.