calender_icon.png 8 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13వ వార్డు అభివృద్ధే నా ధ్యేయం

08-02-2026 12:07:24 AM

కాంగ్రెస్ అభ్యర్థి యాలాల లావణ్య జైపాల్‌రెడ్డి

మొయినాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయడమే పరమా వధిగా, 13వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కాంగ్రెస్ అభ్యర్థి యాలాల లావణ్య జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. నిరంతర ప్రజా సేవ: పదవులు ఉన్నా లేకున్నా గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పుడు అధికారికంగా మరిన్ని సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నానని తెలిపారు.

అందుబాటులో ఉంటూ అభివృద్ధి: వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలు: ప్రభు త్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే లా చూస్తానని, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పా రు.

కాంగ్రెస్ పార్టీతోనే ప్రగతి సాధ్యం కాం గ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాన్య ప్రజల పక్షా న ఉంటుందని లావణ్య జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ‘చేయి‘ గుర్తుపై ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను విన్నవిం చారు. వార్డు ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.