28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో నమోదు కావాలి

29-06-2026 01:02 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి

బంజారాహిల్స్, జూన్ 2౮ (విజయక్రాంతి): అర్హులైన ప్రతిఒక్క ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు.  ఎస్‌ఐఆర్ లో భాగంగా బంజారాహిల్స్ డివిజనులోని ఉదయ్ నగర్ లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్థానికంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు.

ప్రాంతం మారిన వారి వివరాలను సరి చేయాలని అధికారులను కోరారు. ఓటరు జాబితా అనేది ఎన్నికల ప్రక్రియకు పునాది వంటిదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ లక్ష్మి, బీఎల్‌ఏ జట్టు విజయ్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు నరేందర్, రాధా, శౌరిరాజ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.