2 April, 2026 | 11:34 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

10-12-2025 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, డిసెంబర్ 09,(విజయ క్రాంతి): వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి అభివృద్ధిసంక్షేమాలను అందిస్తోందని, వేములవాడ ప్రాంత ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో మరింత అభివృద్ధి జోరందుకుంటుందని, గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమఅభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు.ఇటీవలి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీపై నమ్మకంతో పోలైన ఓట్లలో సగానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థికి వేసి గెలిపించారని గుర్తుచేశారు.గ్రామాల్లో కూడా ప్రజలు ఇదే స్థాయిలో ఆశీర్వాదం చేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు.