10-12-2025 12:00:00 AM
తిమ్మాపూర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు కష్టమొస్తే ముందుంటానని గ్రామాభివృద్ధికి తోడుంటానని సర్పంచ్ అభ్యర్థి దుండ రాజయ్య అన్నారు. గతంలో గ్రామ సర్పంచ్ గా తన భార్య నీలమ్మను ఎలా దీవించారో ఇప్పుడు కూడా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని సర్పంచ్ అభ్యర్థి దుండ రాజయ్య తెలిపారు. గత ప్రభుత్వంలో తిమ్మాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిన ఘనత తమదే అని మరోసారి ప్రజల ఆశీర్వాదం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాననిఅన్నారు.