calender_icon.png 16 December, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోండి

10-12-2025 12:00:00 AM

ఏకగ్రీవ సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే 

సుల్తానాబాద్ డిసెంబర్ 09 (విజయ క్రాంతి): ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు చేరేందుకు గాను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు అని తెలిపారు

సుల్తానాబాద్ మండలం లోని నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామని రాజిరెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ గా కొత్తూరి స్వరూప, రాముని పల్లి సర్పంచ్ గా సబ్బని అనసూయ, పెద్దపల్లి మండలం రాంపల్లి సర్పంచ్ గా కానపర్తి సంపత్ రావు, ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి సర్పంచ్ గా పిట్టల రవీందర్, ఎలిగేడు మండలం రేకల్దేవ్పల్లి సర్పంచ్ గా మద్దెల రమాదేవి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ఎమ్మెల్యే విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కండువాలు, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, వేగోళం అబ్బయ్య గౌడ్, పడాల అజయ్ , కాంగ్రెస్ పార్టీ లీడర్లుపాల్గొన్నారు.