నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు దాడి, కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం 6.30 గంటలకు నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ(Congress candlelight rally) నిర్వహించనుంది.
ఈ నిరసన ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు పాల్గొననున్నారని పార్టీ నేతలు తెలిపారు. నీట్ వ్యవహారంపై కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. నిన్న పీసీసీలకు నిరసన తెలపాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించింది. నీట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.






