25 July, 2026 | 11:20 AM

శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం

25-07-2026 10:48 AM

కొత్తగూడెం, జులై 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గణేష్ టెంపుల్ లో కొలువైన, శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రోజు ఏకాదశి పండుగ(Tholi Ekadashi celebrations ) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారులు పూజా కార్యక్రమాలని ఘనంగా చేపట్టారు. ఈ  పర్వదినం సందర్భంగా ఉ. 7:00 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామి వార్లు, శ్రీ అమ్మావార్ల కీ  పూజ కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రజలు,ఈ  తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి అమ్మ వార్ల, తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు తన్మయత్వం పొందారు. తదుపరి ఈఓ ఆధ్వర్యంలో అర్చక స్వాములు, దేవాలయ సిబ్బందిచే తీర్థ ప్రసాదములు భక్తులకు అందిచడం జరిగింది. స్వామి వారి కృపకు పాత్రులు అయిన, ప్రతి ఒక్కరికి కార్యనిర్వహణాధికారి యన్.రజిని ధన్యవాదాలు తెలియజేశారు.