25 July, 2026 | 11:39 AM

ఉమామహేశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు

25-07-2026 11:05 AM

తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

అచ్చంపేట, జూలై 25: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తన సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధతో కలిసి శనివారం సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని వినాయకుడు మహిషాసుర మర్దిని అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి ముక్కుకున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ఉమామహేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే దంపతులు ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వీరయ్య శాస్త్రి వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాన్ని సమర్పించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ బీరం మాధవరెడ్డి, దేవస్థానం పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.