17 April, 2026 | 2:28 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

బీసీలకు పట్టం కట్టిన కాంగ్రెస్

02-04-2025 12:00 AM
  1. కాంగ్రెస్ బీసీ సమాజం రుణపడి ఉంటుంది
  2. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయ క్రాంతి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, బీసీల దశాబ్దాల కల అయిన బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు యావత్ తెలంగాణ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉం టుందని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

ఈ మేరకు  మంగళవారం ఆయన న్యూడిల్లీలోని తెలంగాణ భవన్లో బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీల పక్షపాతి అని, దేశ ప్రధాని పీఎం మోదీ కూడా బీసీ అని బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని, మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నాయకులు బీసీల వైపు ఉంటారో, అగ్రవర్ణాల వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

దేశంలో కులగణన చేపడతామని చెప్పి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆ హామీని నెరవేర్చకుండా కనీసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయం లో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును పార్లమెంటులో కూడా ఆమో దం తెలపాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంఘాల నాయకులు బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహా ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక రైల్లో తెలంగాణకు చెందిన బీసీ నాయకులంతా వస్తున్నారని, అన్ని సంఘా లు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదని, ఇది బీసీల హక్కు అని, పార్లమెంటు మీద ఒత్తిడి పెంచి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం పొందేలా పోరాడాలని అన్ని పార్టీల, సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఓబీసీ మేధావుల ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, ఎంబిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బడేసాబ్, బీసీ పొలిటికల్ జెఎసి యువజన విభాగం అధ్యక్షుడు చింతపల్లి సతీష్, నాయకులు వివి గౌడ్, అంజన్న యాదవ్, దేవర శివ, రాఘవేందర్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.