12 July, 2026 | 5:39 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

ప్రజలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్

27-05-2025 12:19 AM

ఇచ్చేవి బంజేసండ్రు... ఇచ్చిన మాట తప్పిండ్రు

సిద్దిపేట, మే 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసిందని, సంక్షేమ పథకాలు అమలులో మండి చేయి చూపిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిమర్శించారు. నంగునూరు మండలం పాలమాకుల, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో జరుగుతున్నా శ్రీ చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గొర్ల షెడ్ల వద్ద గది నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేస్తే  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు క్యాన్సల్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇచ్చేవి బంజేసండ్రు, ఇచ్చిన మాట తప్పారన్నారు, కాళేశ్వరం జల్లాలతో రెండు పంటలు పండుతున్నాయని, 

రంగనాయక సాగర్ ద్వారా సిద్దిపేటలో ఎండాకాలం కూడా మత్తల్లు దుంకుతున్నాయని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి కాళేశ్వరం జలాలు సాక్ష్యం అన్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు 200 పెన్షన్ ను 2000చేసారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే 4వేల పెన్షన్ చేస్తా అన్నారు. 4వేలు దేవుడు ఎరుగు కానీ రెండు నెలల పెన్షన్ ఎగొట్టిండ్రన్నారాని, మహిళలకు 2500 ఇస్తా అన్నారు, తులం బంగారమని చెప్పారు అన్ని ఉట్టి మాటలే అయ్యాయి.  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.