సంగారెడ్డి జిల్లాలో 15 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి
అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, మే 26(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది ఏఎస్‌ఐలకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతిని కల్పిస్తూ మల్టీ జోన్- II ఐజి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ తెలిపారు.
1990లో పోలీసు కానిస్టేబుల్ గా నియామకమై 35 ఏళ్ళుగా ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసుశాఖలో విశిష్ట సేవలందించిన, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు చెందిన 15-మంది ఏఎస్‌ఐలను ఎస్‌ఐలుగా పదోన్నతి కలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు కే.గంగయ్య, కే.సుధాకర్, శ్రీహరి, సంజీవ రెడ్డి, షాబుర్ రహేమాన్, యం.లక్ష్మీనారాయణ, దుర్గయ్య, జి.నారాయణ, వై.మల్లేశ్వర్, జి.బిక్షపతిలను అభినందించి, ఎస్‌ఐ ర్యాంక్ చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.






