25 July, 2026 | 2:27 AM

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కలిసిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు

25-07-2026 01:50 AM

మీర్ పేట్, జూలై 24 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి (ప్రశాంతి హిల్స్), చల్లా బాల్ రెడ్డి (మీర్పేట్), సిద్దాల శ్రీశైలం (జిల్లెలగూడ) మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనఅధ్యక్షులను శాలువాతో సత్కరించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిద్ధల దశరథ్, పల్లె పాండు గౌడ్, కుంచె నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.