25 July, 2026 | 3:07 AM

కేటీఆర్‌కు పుట్టి నరోజు కానుక

25-07-2026 02:26 AM

సన్నబియ్యం ర్యాపిడోలో పంపిన పీషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేటీఆర్ పుట్టినరోజు కానుకగా కేటీఆర్ ఇంటి కి రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్నబియ్యాన్ని రాపిడోలో పీషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ శుక్రవారం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని, ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండగ అనుకునేది రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో ప్రతి ఇంట్లో పండగ రోజుల చేస్తున్నాడని చెప్పారు.

కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. 25 కేజీల సన్న బియ్యం కేటీఆర్ పుట్టినరోజు కానుకగా పం పినట్టు తెలిపారు. ప్రతి నెల కూడా పంపిడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజా ప్ర భుత్వంలో పేదలు సన్న బియ్యంతో భోజ నం చేస్తున్నారని, వారి కుటుంబం కళ్ళలో ఆనందం చూడటమే మా ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ సన్న బియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరు తినొచ్చు అని చెప్పారు.