12 March, 2026 | 5:05 AM

దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి

12-03-2026 01:42 AM

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్

సిద్దిపేట, మార్చి 11 : దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అహర్నిశలు కృషి చేస్తోందని ఆ పార్టీ ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ చెప్పారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 12న కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ గా ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. సిద్దిపేట జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుట్ల ఏసు, కొత్తూరి నరహరి, ముత్యాల యాదగిరి, బొడ్డు బాలరాజు, పుట్ల ప్రసాద్, మందాల దాసు, బూరుగుపల్లి సర్పంచ్ బాలయ్య, బయ్యారం యాదగిరి, కృష్ణ, యాదగిరి, కృష్ణ, శ్రీను, తిరుపతి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.