12 March, 2026 | 3:27 AM

రేపు టీఆర్పీ బహిరంగ సభ

12-03-2026 01:41 AM
  1. గోపాలపురంలో నిర్వహణ
  2. హాజరుకాన్ను అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఈ నెల 13న హనుమకొండ 56వ డివిజన్ గోపాలపురంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ తెలిపారు. గోపాలపురంలోని టిఆ ర్పి జిల్లా నాయకుడు పుట్ట రాజు నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

గోపాలపురంలోని సర్ధార్ సర్వాయి పాపన్న జంక్షన్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్నట్టు తెలిపారు. సభకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మల్లన్న గారి అభిమానులు, వివిధ బీసీ సం ఘాలు, కుల సంఘాల నాయకులు పెద్ద సం ఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షు లు వెంకటేష్ గౌడ్, ఐనవోలు మల్లికార్జున శా స్త్రి, పోలు రాజు, మార్త శ్రీనివాస్, కందుకూరి శ్రీనాథ్, జోసఫ్, మధు, భద్రకాళి రమణ, అర్షం రంజిత్, అరుణ్, అన్వేష్, శ్రీను పాల్గొన్నారు.