04-02-2026 04:44:02 PM
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సమ్మేళనం మహబూబ్ నగర్ లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సంరద్భం గా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంల మత రాజకీయాలు చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో దేవాలయాలు కూలగొడితే కాంగ్రెస్ స్పందించలేదని, బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయమని, అణచివేయాలని చూస్తున్నారు. 90 శాతం మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, బీఆర్ఎస్ నేతలు ఇదే విధంగా అహంకారం ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని, బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి విజ్ఞప్తి చేశారు.