11 April, 2026 | 9:01 AM

బండి సంజయ్‌పై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

10-02-2026 12:41 AM

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎంఐఎం పార్టీ నాయకులకు మధ్య వంద కోట్ల ఒప్పందం కుదిరిందని చేసిన ఆరోపణల పై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం సుడా  చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వన్ టౌన్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం  సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆకార భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.