calender_icon.png 2 February, 2026 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పద్మావతి

02-02-2026 06:18:06 PM

కోదాడ: కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు లో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకట్ రత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించాలన్నారు.

మంత్రి ఉత్తమ్ సహాకారంతో కోదాడను అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలుపుతా అన్నారు. కోదాడ మున్సిపాలిటీ 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంత్రి ఉత్తమ్ కు కానుకగా ఇవ్వాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వార్డు లోని నాయకుల ను కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ప్రతి ఓటర్ కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. మాజీ సర్పంచ్ యెర్నేని వెంకట్ రత్నం బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు, పట్టణ నాయకులు, స్థానిక వార్డు నాయకులు, కార్య కర్తలు ప్రముకులు ఉన్నారు.