calender_icon.png 28 December, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

28-12-2025 04:24:31 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు నివాసం వద్ద ఆది వారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.