calender_icon.png 28 December, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

28-12-2025 04:29:01 PM

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దకాపర్తి గ్రామంలో సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఆదివారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాటo  వెంకటేశం  జెండాన్ని ఆవిష్కరించగా,  ఉపసర్పంచ్ వరుసు సైదులు కొబ్బరికాయ కొట్టి, పార్టీ త్యాగదనులను, నాయకులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏర్పుల యాదయ్య, ఏర్పుల వెంకన్న, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, నూతి వెంకటేశం, బైరవని భిక్షం, జిల్లా నరసింహ, గుండబోయినరసింహ, ఓర్సు కృష్ణ, పొట్లపల్లి లింగస్వామి, కురు ఈదయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.