2 July, 2026 | 5:18 PM

బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ

02-07-2026 04:40 PM

ఇల్లందు, జులై 2 (విజయక్రాంతి): బహిరంగ చర్చకు సవాల్ విసిరి అనంతరం వెనక్కి తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ విమర్శించారు. గురువారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్ మంత్రుల సవాల్‌ను స్వీకరించి తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. చర్చలకు రమ్మని పిలిచి, నాయకులు చేరుకున్న తర్వాత పోలీసులతో అడ్డుకోవడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

బీఆర్ఎస్ నాయకులు అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్డుకుందని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎక్కువకాలం సాగవని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన సమాధానం లభిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నెమలి ధనలక్ష్మి, కాసాని హరిప్రసాద్ యాదవ్, సత్తాల హరికృష్ణ, నీలం రాజశేఖర్, నెమలి నిఖిల్, బిఫిన్ రాథోడ్, వార రమేష్, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.