విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయండి
02-07-2026 05:11 PM
నిర్మల్, జులై ( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నామని నాయకులు మహేందర్ దిగంబర్ వెంకటేశులు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలకు మౌలిక సదుపాయాలు పరువయ్యాయన్నారు. ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలన్నారు. అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కార కోసం విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.






