ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి
02-07-2026 05:12 PM
నిర్మల్ జులై 2 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఉన్నారు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు మూత్రశాలను లేక బాలికలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి పాఠశాలను సందర్శించారు. పాఠశాల సమస్యలను కలెక్టర్, డీఈఓ దృష్టి కి తెస్తానని తెలిపారు. ఎన్నోసార్లు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






