18 April, 2026 | 6:57 PM

తులం బంగారం పేరుతో కాంగ్రెస్ మోసం..

31-05-2025 12:00 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచ్చోడ, మే 30 (విజయక్రాంతి):  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించినకళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో అద్భుతం అని, కానీ ప్రస్తుతం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.

ఇచ్చోడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 69 మం ది లబ్ధిదారులకు రూ. 1,00,016/- చొప్పున కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ రావా లని కోరితే ఈసారైనా తుళం బంగారం వచ్చిందేమో అని అనుకున్నాం కానీ.. ఈ సారి కూడా నిరాశే మిగిలిందన్నారు. తులం బంగారం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.