17 April, 2026 | 3:12 AM

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

28-06-2025 01:51 AM

- బీజేపీ ఎమర్జెన్సీ డ్రామాలు బంద్ చేయాలి 

- పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. హైకోర్టులో కేసు ఉండ టం వల్లే ఇప్పటి వరకు  స్థానిక ఎన్నికలు నిర్వహించలేదన్నారు.

శుక్రవా రం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో చేసిన  కులగణన దేశానికే దిక్సూచిగా మారిందని తెలి పారు. బీజేపీ నాయకులు ఎమర్జెన్సీ డ్రామాలను బంద్ చేయాలని  హిత వు పలికారు. ఇందిరాగాంధీ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేశారన్నారు. ప్రజల్లో బీజేపీపై పెరుగు తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే ఎమర్జెన్సీ పేరుతో డ్రా మాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.