రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్
సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు కే మురళీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాది పండుగను ఘనంగా జరుపు కోవాలన్నారు.
బీఆర్‌ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మారిస్తే సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని కొని యాడారు. హైదరాబాద్ టోక్యో, న్యూయార్క్, సిం గపూర్, నగరాలతో పోటీ పడుతుందని సీఎం రే వంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, కృషితో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. నాంపల్లి పతే సుల్తాన్ లేన్‌లో ముస్లింలకు ‘ఇఫ్తార్ విందు‘కు సహాయంగా రూ.15 వేల చెక్కుని అందజేశారు.




