17 June, 2026 | 1:33 PM

ఓట్ల్ల సీట్ల చోరీ కాంగ్రెస్ నైజం

16-06-2026 01:17 AM
  1. సర్దార్ పటేల్‌కు కాకుండా ఓటు చోరీ చేసి నెహ్రూ ప్రధాని కాలేదా? n అసలు ఓటుకు నోటుతో ఓటు చోరీ చేసింది రేవంత్‌రెడ్డే 
  2. రోహింగ్యాల ఓట్లు ఎగిరిపోతాయనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంల ఏడుపు 
  3. సర్‌పై తప్పుడు ప్రచారం
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఓట్ల సీట్ల చోరీ కాంగ్రెస్ నైజమని, దాని చర్రిత కూడా అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో సర్ జరుగుతోంటే బంగ్లాదేశీ, రోహింగ్యాల దొం గ ఓట్లు ఎగిరిపోతాయనే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంల ఏడుపులు, పెడబొబ్బులు పెడుతున్నాయని ఆగ్రహించారు. సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అనేది ప్రధాని మోదీ పెట్టింది కాదని, దేశంలో 1951 నుంచి 2002 వరకు 12 సార్లు జరిగిందని, అప్పుడు కాంగ్రెస్సే ఉందని తెలిపారు.

నాడు తాము బాధ్యతకలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎస్‌ఐఆర్‌ను సపోర్ట్ చేశామని, కానీ ఈరోజు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతేడాదిలో ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు 124 పేజీల ఆర్డర్ కాపీ ఇచ్చిందని, అందులో ఎస్‌ఐఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంకాదని తెలిపిందన్నా రు. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు, నెహ్రూకు కేవలం 2 ఓట్లు వస్తే నెహ్రూను పీఎంను చేయడం ఓటు చోరీ కాదా అని ప్రశ్నించారు.

అసలు ‘ఓటుకు నోటు’తో ఓటు చోరీ చేసింది రేవంత్‌రెడ్డే అన్నారు. అక్రమ చొరబాటు దారుల ఓట్లు తొలగించొద్దా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే వాళ్ల ‘మెదడు చోరీ’ అయిందని పిస్తోందని ఎద్దేవా చేశారు. 1980 లోనే సోని యా గాంధీ భారత పౌరసత్వం పొందకముం దే ఇందిరా గాంధీ సఫదర్జంగ్ రోడ్ నివాసం లో (పోలింగ్ స్టేషన్ 145, సీరియల్ నెం.388) ఓటరుగా నమోదయ్యారని వివరించారు.

కాంగ్రెస్ చరిత్రే ఓట్ల చోరీ, సీట్ల చోరీలతో కూడుకున్నదన్నారు. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎమర్జెన్సీ విధించి, రాజ్యాంగాన్ని చోరీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని నిలదీశారు. బోగస్ ఓట్లతో గెలిచేది వారేనని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్‌కు చెందినవారికి రిటైర్‌మెంట్ తర్వాత పద్మ అవార్డులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు.

బోగస్ ఓట్లతో గెలిచే అలవాటున్న కాం గ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు.. ఇప్పుడు ఎస్‌ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు ఎగిరిపోతాయనే భయంతో ఏడుస్తున్నాయన్నారు. ఎస్‌ఐఆర్ వల్లే బంగాల్‌లో బీజేపీ గెలిచిందని మేధావులమని చెప్పుకునే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మరి అదే ఎస్‌ఐఆర్ జరిగిన కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచినప్పుడు ఎస్‌ఐఆర్ గుర్తుకురాలేదా అని నిలదీశారు. రాజకీ యాల్లో గెలుపోటములు ప్రజాతీర్పుపై ఆధారపడి ఉంటాయన్నారు. అర్హత లేని ఓట్లను తొలగించే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో పాకిస్తానీయులు

దేశ సరిహద్దులైన బీహార్, పశ్చిమ బంగాల్‌తో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ అక్రమ చొరబాటుదారులు ఉన్నారని రాంచందర్‌రావు అన్నారు. వారంతా స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దొంగ ఆధార్‌కా ర్డులు, రేషన్ కార్డులు సంపాదించి, ఓటర్లుగా నమోదవుతున్నారని తెలిపారు. ఓల్డ్ సిటీలో ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 5 వేల నుంచి 10 వేల మంది పాకిస్తానీయులు చట్టవిరుద్ధంగా ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలా అని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంను ప్రశ్నించారు.

గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో అడ్డం గా దొరికిపోయిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ గెలవబోతోందని, ఓటమి భయంతోనే ఈ ముఠా అంతా కలిసి బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తోంద న్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి బూత్ వద్ద అన్ని పార్టీల బూత్‌లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ), రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వో) పాల్గొంటున్నారని, అంతా పారదర్శ కంగా జరుగుతోందని వివరించారు.