తడాఖా చూపిస్తామని.. తలలు వంచుతారు
- వారంతా ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు
- ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ తీరు మారలేదు
- దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప.. తనకు ఏ ఆలోచనా లేదు
- అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా?
- కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది
- జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామం టూ చాలామంది పెద్ద లు మాటలు చెబుతార ని, వాస్తవానికి అలాం టి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు.. అసంతృప్తిని, అశాంతిని సృష్టించిందని, అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదన్నారు. జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ అని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదని, 2014లో ఏపీని విభజించిన తీరు ను చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశామని స్పష్టం చేశారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటామని, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చన్నారు. ‘ఈ మధ్య కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నామని, కాక్రోచ్ పార్టీ ని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి‘ అని అన్నారు.
జనసేన ప్రారంభించిన ప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప.. తనకు ఏ ఆలోచనా లేదని వెల్లడించారు. పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో, రాదో కూడా తెలియదన్నారు. ‘జాతీయ సమగ్రత కోసం ప్రస్థానం’ పేరిట ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజ యాలు ఎదుర్కొన్నామని చెప్పారు.
‘మారుతు న్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏడు ప్రాథమిక సూత్రాలను వదల్లే దు. నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధిం చాం. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి.. 20 లక్షలకు పైగా సభ్యత్వాలు వచ్చా యి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలి’అని పిలుపునిచ్చారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు బయల్దేరితే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. అమరులకు నివాళులర్పించేందుకు అనుమతి కావాలా అని నిలదీశారు. ఇండియా గేట్‌కు వెళ్లి సైనికులకు వందనం చేయాలంటే కశ్మీర్, పంజాబ్‌లో పుట్టాలా? అని ప్రశ్నించారు. ‘నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యా రు. ఒక నేల కోసం ఇంతలా ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అనిపించింది.
అందుకే వారంటే నాకు గౌరవం. యువతను బలిచేసి నాయకులు గద్దెనెక్కారు. అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా?.. వారి ప్రాణ త్యాగాలను ఎన్నేళ్లకు గుర్తిస్తారని’ ప్రశ్నించారు. ‘ఏ ఆశయాల కోసం తెలంగాణ వచ్చిం దో.. దానికోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది.. నేతలు, కార్యకర్తలు నిలబడాలి’ అని సూచించారు. ‘తెలంగా ణ నా నేల కాదా, నా దేశం కాదా’ అని ప్రశ్నించారు.
తెలంగాణ యుతపై తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయం లో జరిగిన బలిదానాలు తనను కలిచివేశాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం తనలో స్ఫూర్తిని నింపిందని, ఆ రాష్ట్రం కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తు తం కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహా స్యం చేస్తోందని విమర్శించారు. 12 ఏళ్లు పోరాటమే తమ ఊపిరిగా బతికామని చెప్పారు. క్రిమినల్ పార్టీలతో తాము పోరాడామని వైసీ పీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ విమర్శించారు.






