calender_icon.png 9 July, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్

09-07-2025 12:00:00 AM

-ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు 

-అభివృద్ధిలో దేశానికి  తెలంగాణ రోల్ మోడల్ 

-12 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

-త్వరలో రాజీవ్ యువవికాసం అమలు

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

మహబూబాబాద్, జూలై 8 (విజయ క్రాంతి): అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతు భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజల కోసం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం  ముందుకు సాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండ,  కేసముద్రం మున్సిపాలిటి పరిధిలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవె న్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వర్ధన్ననపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, తదితరులతో కలిసి పాల్గొన్నారు.

మహబూబాబాద్ పరిధిలో 71.43 కోట్లతో రహదారులు, పురపాలక పట్టణ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్, నూతన సబ్ స్టేషన్ నిర్మాణం, శంకుస్థాపనలు, కేసముద్రం పరిధిలో 223,35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, రహదారులు, భవనాల శాఖ, పట్టణంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు, తెలంగాణ ట్రాన్స్మిషన్ నూతన సబ్స్టేషన్ నిర్మాణం, సీసీ రోడ్లు కల్వర్టులు అంతర్గత అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, నూతన గిడ్డంగుల నిర్మాణం, దేవాదాయ శాఖ ఆలయాల అభివృద్ధి పనులు, తదితర శంకుస్థాపనలు చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక 11,263, గ్రూపులకు 2,129. లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ యావత్తు ప్రపంచం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రైతు భరోసా, రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం అమలు నిధుల పెంపు, ప్రభుత్వ పాఠశాలలో కాస్మోటోకి చార్జీల పెంపు, నూతన డైట్ మెనూ అమలు, త్రాగునీరు, సాగునీరు, తదితర అనేక పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

పేదవాడి సొంత ఇంటి కల నిజం చేస్తున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ధరణి ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత ప్రభుత్వం నూతన భూభారతి రెవెన్యూ చట్టం అమలు చేసి ప్రతి ఒక్కరి భూ సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తుందన్నారు. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని నారాయణపురం, సీతానగరం, పంతులు తండా లలో ఉన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు. 

తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు రైతు భరోసా అందజేశాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేసముద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట సభలో రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన విస్తృతంగా సాగుతుందని 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా అందించి రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేషమన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కేవలం 15 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 17 నెలల్లో 21 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసి చూపించమన్నారు.

ఇక మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో అహర్నిశలు పనిచేస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్, రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నంటి వుండిన నేత వేం నరేందర్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. రాష్ట్రంలో  ఏ నియోజక వర్గానికి ఇవ్వని విదంగా 200 కోట్ల రూపాయల నిధులతో రోడ్లన్నీ మంజూరు జరిగాయాన్నారు.

నేడు వ్యవసాయ ఉత్పత్తులకు అవసరం ఉన్న గిడ్డంగులను సుమారు 10 కోట్ల రూపాయలతో నేడు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క100 కోట్ల రూపాయలతో కేసముద్రం మండల కేంద్రంలో 133 కెవి సబ్ స్టేషన్ 3  33 కెవి సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసు న్నామన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దళసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.