ప్రధాన రహదారి ఇలా.. ప్రయాణం చేసేది ఎలా..?
14-08-2026 09:46 AM
బెజ్జూర్,ఆగస్టు14(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ప్రధాన రహదారి అంతా బురదమయంగా కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. మండలంలోని ఏటి గూడ ప్రధాన రహదారి అంత బురదమయంగా ఉండడంతో ప్రతినిత్యం వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. రహదారి ఇలా ఉంటే ప్రయాణం చేసేది ఎలా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతతో రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రోడ్డు పూర్తిగా పాడైపోయిందని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసేలా చూడాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.






