14 August, 2026 | 10:40 AM

పినపాకలో మండల స్థాయి వ్యాసరచన పోటీలు

14-08-2026 09:33 AM

​పినపాక (విజయక్రాంతి): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పినపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన పోటీలు  ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం ,కంది చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.  "స్వాతంత్ర్య భారత శతాబ్దిలో నా పాత్ర, నా స్వప్నం" ఈ పోటీలను "స్వాతంత్ర్య భారత శతాబ్దిలో నా పాత్ర, నా స్వప్నం" అనే ప్రత్యేక అంశంపై నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8, 9, ,10వ తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్, హిందీ) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించి బహుమతులు అందజేయనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. రామిరెడ్డి తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కృష్ణమూర్తి, రాంగోపాల్, మంగతాయారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. నాగేశ్వరరావు, రాము, హరీష్, సెల్వియా, విజయ కుమారి, కేశవరావు, రాంబాబు తదితరులు పాల్గొని పోటీల నిర్వహణలో భాగస్వాములయ్యారు.

​మొత్తం పాల్గొన్న విద్యార్థులు: 95 మంది

​తెలుగు మాధ్యమం: 40 మంది

​ఇంగ్లీష్ మాధ్యమం: 39 మంది

​హిందీ మాధ్యమం: 16 మంది

​ఆగస్టు 15న విజేతలకు బహుమతుల ప్రధానం