10-06-2025 10:59:58 PM
తూప్రాన్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జిన్న కృష్ణ, ఉపాధ్యక్షుడు ధరావత్ బన్సీ నాయక్, సెక్రటరీ నాగరాజు ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పత్రాలను లబ్ధిదారులకు అందించారు, పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.