29 July, 2026 | 7:46 PM

Breaking News

భూగర్భజలాల పెంపు అవసరం

29-07-2026 07:07 PM

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నందున భూగర్భజలాల పెంపుపై శ్రద్ధ తీసుకోవాలని భీంపూర్ మండల ప్రత్యేక అధికారి గోపి కిషన్, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి లు సూచించారు. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన మండలస్థాయి సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ఇంకుడు గుంతలు తప్పనిసరి నిర్మించుకోవాలని ఆయన గుర్తుచేశారు.

విద్యార్థులకు అవసరమైన సర్టిపికెట్ల జారీ భూసమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తహసీల్దార్ రమేష్ నాయక్ అన్నారు. చేలలో, గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సర్పంచులు కోరారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అందరూ పరిశుభ్రత పాటించాలని హెచ్ఐవో జ్ఞానేశ్వర్ సూచించారు. సర్పంచులు ప్రధానంగా గ్రామాలలో మురికికాలువల శుభ్రం,శుద్ధ జలం అందించటంపై శ్రద్ద తీసుకోవాలని అధికారులు సూచించారు.. అవసరమైనంత యూరియా అందుబాటులో  ఉందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.