21 March, 2026 | 10:11 PM

రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు

21-03-2026 02:01 PM

శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యాం నాయక్

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో నియోజకవర్గ ఇంచార్జ్ శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ తో కలసి పాల్గొన్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆత్మశుద్ధితో, నియమ నిష్ఠలతో ఈ పవిత్ర పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. రంజాన్ పండుగ ఓపిక, నియమాలు, పరస్పర ప్రేమను పెంపొందించే పండుగగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు.

ఈద్గా వద్దకు విచ్చేసిన ముస్లిం సోదరులను ఆమె ఆత్మీయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, కౌన్సిలర్ జాడి వినోద్, సర్పంచ్ టెకం గంగారాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీమ్ రావ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదెవేణి మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి, సీనియర్ నాయకులు కామ్రే అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, మోర్లే విశ్వనాథ్, వినోద్, రాము తదితరులు పాల్గొన్నారు.