calender_icon.png 7 May, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా, రాహుల్ గాంధీలపై పెట్టిన కేసులకు నిరసనగా కాంగ్రెస్ నేతల ధర్నా.. రాస్తారోకో

18-04-2025 01:47:49 AM

ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  పార్టీ అగ్ర నేతలపై అక్రమ కేసులు బనాయించిందని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. నేషనల్ హెరాల్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పై ఈడి అక్రమంగా చార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ లోని క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈడి, మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్  శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు  చేశారు. కాంగ్రెస్, పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటు పడే పార్టీ ఎమ్మెల్సీ అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బిజెపి కుట్రలు చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు.కేంద్రంలో బిజెపి అరాచక పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు.

బిజెపి ప్రభుత్వంలో దేశ సంపాదనంతా సంపన్నులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బిజెపికి ప్రజలు గుణపాఠం చెప్తారని, కేంద్రంలో ఆ ప్రభుత్వం పతనం అవుతుందన్నారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, సమద్, బొజ్జ శంకర్, ఇంతియాజ్ హుస్సేన్, అల్లి సుభాష్ యాదవ్, శ్రీనివాస్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీనివాస్, ఇంతియాజ్ అలీ, గురీజ వెంకన్న, ఆలకుంట్ల మోహన్ బాబు,

అమేర్, కరుణాకర్ రెడ్డి, కత్తుల కోటి, వంగాల అనిల్ రెడ్డి,దుబ్బ రూప, కందిమల్ల నాగమణి రెడ్డి, బొడ్డుపల్లి సుజాత, నాంపల్లి భాగ్య, దుబ్బ అశోక్ సుందర్, పెరిక వెంకటేశ్వర్లు, గుండగోని సాయి, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, గుండగోని సాయి, ఇబ్రహీం, పాదం అనిల్, బాబా, పూలే జయకుమార్, సూరెడ్డి సరస్వతి, సుజాత లక్ష్మి, లక్ష్మీ బాయ్, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.